మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Sri Bala Shanti Stotram – శ్రీ బాలా శాంతి స్తోత్రం


శ్రీభైరవ ఉవాచ |
జయ దేవి జగద్ధాత్రి జయ పాపౌఘహారిణి |
జయ దుఃఖప్రశమని శాంతిర్భవ మమార్చనే || 1 ||

శ్రీబాలే పరమేశాని జయ కల్పాంతకారిణి |
జయ సర్వవిపత్తిఘ్నే శాంతిర్భవ మమార్చనే || 2 ||

జయ బిందునాదరూపే జయ కళ్యాణకారిణి |
జయ ఘోరే చ శత్రుఘ్నే శాంతిర్భవ మమార్చనే || 3 ||

ముండమాలే విశాలాక్షి స్వర్ణవర్ణే చతుర్భుజే |
మహాపద్మవనాంతస్థే శాంతిర్భవ మమార్చనే || 4 ||

జగద్యోని మహాయోని నిర్ణయాతీతరూపిణి |
పరాప్రాసాదగృహిణి శాంతిర్భవ మమార్చనే || 5 ||

ఇందుచూడయుతే చాక్షహస్తే శ్రీపరమేశ్వరి |
రుద్రసంస్థే మహామాయే శాంతిర్భవ మమార్చనే || 6 ||

సూక్ష్మే స్థూలే విశ్వరూపే జయ సంకటతారిణి |
యజ్ఞరూపే జాప్యరూపే శాంతిర్భవ మమార్చనే || 7 ||

దూతీప్రియే ద్రవ్యప్రియే శివే పంచాంకుశప్రియే |
భక్తిభావప్రియే భద్రే శాంతిర్భవ మమార్చనే || 8 ||

భావప్రియే లాసప్రియే కారణానందవిగ్రహే |
శ్మశానస్య దేవమూలే శాంతిర్భవ మమార్చనే || 9 ||

జ్ఞానాజ్ఞానాత్మికే చాద్యే భీతినిర్మూలనక్షమే |
వీరవంద్యే సిద్ధిదాత్రి శాంతిర్భవ మమార్చనే || 10 ||

స్మరచందనసుప్రీతే శోణితార్ణవసంస్థితే |
సర్వసౌఖ్యప్రదే శుద్ధే శాంతిర్భవ మమార్చనే || 11 ||

కాపాలికి కళాధారే కోమలాంగి కులేశ్వరి |
కులమార్గరతే సిద్ధే శాంతిర్భవ మమార్చనే || 12 ||

శాంతిస్తోత్రం సుఖకరం బల్యంతే పఠతే శివే |
దేవ్యాః శాంతిర్భవేత్తస్య న్యూనాధిక్యాదికర్మణి || 13 ||

మంత్రసిద్ధికామనయా దశావృత్త్యా పఠేద్యది |
మంత్రసిద్ధిర్భవేత్తస్య నాత్ర కార్యా విచారణా || 14 ||

చంద్రసూర్యోపరాగే చ యః పఠేత్ స్తోత్రముత్తమమ్ |
బాలా సద్మని సౌఖ్యేన బహుకాలం వసేత్తతః || 15 ||

సర్వభద్రమవాప్నోతి సర్వత్ర విజయీ భవేత్ |
తీర్థకోటిగుణం చైవ దానకోటిఫలం తథా |
లభతే నాత్ర సందేహః సత్యం సత్యం మయోదితమ్ || 16 ||

ఇతి చింతామణితంత్రే శ్రీ బాలా శాంతి స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.